Byju Raveendran : అమెరికా : ప్రముఖ భారతీయ కంపెనీ బైజూ అధినేత రవీంద్రన్ (Byju Raveendran) కు కోలుకోలేని షాక్ తగిలింది. బైజూస్ రవీంద్రన్ కంపెనీకి చెందిన నిధులను అక్రమంగా తరలించి, దాచిపెట్టారని నిర్ధారించింది అమెరికా కోర్టు. ఎల్ఎల్సీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది కోర్టు. ఈ మేరకు పిటిషనర్‌కు 1.07 బిలియన్ డాలర్లు చెల్లించాలని అమెరికా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వెంటనే చెల్లించాలని ఆదేశించింది. అమెరికాకు చెందిన ఫైనాన్సింగ్ విభాగమైన బైజుస్ ఆల్ఫా నుండి నిధుల తరలింపు, దాచడం కోసం వ్యక్తిగతంగా బాధ్యత వహించేలా చేస్తూ US దివాలా కోర్టు బైజు రవీంద్రన్‌ను $1.07 బిలియన్లకు పైగా చెల్లించాలని ఆదేశించింది.
Byju Raveendran Shocking Comments
డెలావేర్ దివాలా కోర్టు న్యాయమూర్తి బ్రెండన్ షానన్ జారీ చేశారు. కోర్టు ముందు హాజరు కావడానికి, పత్రాలను అందించడానికి రవీంద్రన్ ఆదేశాలను పాటించడంలో పదేపదే విఫలం అయ్యారని ఆరోపించారు. కాగా డిఫాల్ట్ తీర్పు అనేది ఒక పార్టీ వ్యాజ్యంలో పాల్గొననప్పుడు లేదా కోర్టు ఆదేశాలను విస్మరించినప్పుడు, కోర్టు విచారణ లేకుండా కేసును నిర్ణయించడానికి అనుమతించినప్పుడు జారీ చేయబడిన తీర్పు. బైజు రవీంద్రన్ అన్ని ఆరోపణలను తిరస్కరించాడు. అమెరికా కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేస్తానని తెలియజేశాడు. యుఎస్ కోర్టు డిఫాల్ట్ తీర్పును త్వరితగతిన జారీ చేసి, తనను డిఫెన్స్ సమర్పించకుండా నిరోధించిందని రవీంద్రన్ ఆరోపించాడు.
ఆల్ఫా రుణాల నుండి వచ్చే డబ్బును బైజు రవీంద్రన్ తమ వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించ లేదని, థింక్ , లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రయోజనం కోసం ఉపయోగించారని ఆయన తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. జీఎల్ఏఎస్ ట్రస్ట్‌కు తెలుసనే వాస్తవాన్ని డెలావేర్ కోర్టు తీర్పు కూడా ప్రస్తావించ లేదని ఆరోపించారు.
Also Read : Dheekshith Shetty Strong Reaction : రష్మిక మందన్నా ప్రేమ విషయం వ్యక్తిగతం



















