BRS : హైదరాబాద్ – రాష్ట్రంలో యూరియా కొరత తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ (BRS) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లో ఆందోళన చేపట్టారు. ఇవాళ శాసన సభ ప్రారంభమైంది. ఈ సందర్బంగా అన్నదాతల పట్ల కాంగ్రెస్ రేవంత్ సర్కార్ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. యూరియా సరఫరా నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా సీరియస్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. గత నెల రోజులుగా రైతులు నిద్రాహారాలు మాని తెల్లవారజాము నుండే పడిగాపులు కాస్తుంటే మీకు పట్టింపు లేదా అని నిలదీశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
BRS MLA’s Fired Congress Govt
కరోనా లాంటి విపత్తు సమయంలో కూడా తాము ఎరువులు అందించడం జరిగిందని చెప్పారు. ఇప్పుడు ఎందుకు ఆలస్యం జరుగుతోందని ప్రశ్నించారు. ఓ వైపు కేంద్రం ఉన్నపళంగా అడిగిన తక్షణమే కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యూరియాను పంపించిందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు పంపించ లేదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. ఎరువుల కొరతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సీఎంకు తెలిసింది రెండే విద్యలని అన్నారు. ఒకటి ఢిల్లీకి మూటలు మూయడం , రెండోది మాటలు మార్చడం తప్పా ఇంకేమీ రాదంటూ మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. రాష్ట్రంలో యూరియా కొరత లేదంటూ అబద్దాలు చెప్పారన్నారు.
Also Read : Krishna Water Reach Kuppam Interesting : కుప్పానికి చేరుకున్న కృష్ణమ్మ నీళ్లు















