Guvvala Balaraju : హైదరాబాద్ – అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలనంగా మారారు. సుదీర్ఘ కాలం పాటు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీలో ఉన్నారు. నాలుగు సార్లు అచ్చంపేట ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి పోటీ చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ విప్ గా కూడా పని చేశారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా గుర్తింపు పొందారు. కాగా గత కొంత కాలం నుంచి తను పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. తనకు ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పిన హైకమాండ్ ఉన్నట్టుండి మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సీటు కేటాయించింది. మల్లు రవి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఇదే సమయంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో గువ్వల బాల రాజు (Guvvala Balaraju) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చేతిలో భారీ తేడాతో అపజయం పొందారు. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారి పోయింది. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది.
Guvvala Balaraju Shocking Comments
ఎవరూ ఊహించని విధంగా తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఈ సందర్బంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఆర్ఎస్పీ పోటీనే కాదన్నారు. ఆయనకంటే రాజకీయ రంగంలో తాను సీనియర్ నని చెప్పారు. అచ్చంపేట ప్రజలు నన్ను రెండుసార్లు ఆశీర్వదించి గెలిపించారని చెప్పారు. బీఆర్ఎస్‌లో నా ఆశయాలకు అనుకున్న స్థాయిలో గౌరవం దక్కలేదంటూ వాపోయారు. కేసీఆర్ అధికారం కోల్పోయాక ఇంటినుంచే ఆదేశాలిచ్చారని అన్నారు. ప్రభుత్వాన్ని కేసీఆర్ సరిగ్గా ప్రశ్నించడం లేదంటూ మండిపడ్డారు. సమస్యలపై బీఆర్ఎస్ అగ్రనేతలు పోరాటం చేయట్లేదదన్నారు.
Also Read : Trump Tariffs Indian Goods Effective : ట్రంప్ సుంకాలతో భారీగా పెరిగే వస్తువులు ఇవే

















