Brazil : బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రత్యేక ప్యానెల్ గురువారం (సెప్టెంబర్ 11, 2025) కీలక తీర్పు ఇచ్చింది. ఆయనపై కూప్రయత్నం ఆరోపణలు రుజువయ్యాయని కోర్టు ప్రకటించి, 27 ఏళ్లు 3 నెలల జైలు శిక్ష విధించింది.
Brazil Ex President Shocking
2022 ఎన్నికల్లో ఓటమి పాలైన బోల్సోనారో తిరిగి అధికారంలోకి రావడానికి కుట్ర పన్నారని న్యాయస్థానం తేల్చింది. ఐదుగురు న్యాయమూర్తుల ప్యానెల్‌లో నలుగురు ఆయనను ఐదు ఆరోపణల్లో దోషిగా తేల్చారు. అయితే తుది తీర్పు ఐదవ న్యాయమూర్తి అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం బోల్సోనారో బ్రసీలియాలో గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆయనకు అప్పీల్ చేసే అవకాశం ఉంది. అన్ని కేసుల్లోనూ దోషిగా తేలితే 40 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయవర్గాలు సూచిస్తున్నాయి.
తీర్పు వెలువడిన కొన్ని గంటలకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, బోల్సోనారోను “అద్భుతమైన నాయకుడు”గా అభివర్ణించారు. అంతేకాకుండా, ఈ విచారణను “విచ్ హంట్” (రాజకీయ వేధింపు)గా అభిప్రాయపడి, బ్రెజిల్ (Brazil) దిగుమతులపై 50% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు.
బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కార్మెన్ లూసియా బోల్సోనారోను “నేర సంఘటన”కు నాయకత్వం వహించినట్టు తేల్చారు. మిగతా ఆరోపణలపై ఆమె ఓటు ఇంకా మిగిలి ఉంది.
ఇక, బోల్సోనారో మాత్రం తాను రాజకీయ వేధింపులకు గురవుతున్నానని ఆరోపిస్తూ, ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read : CM Fadnavis Warning : శివాజీ నగర్ పేరుమార్పుపై మహారాష్ట్ర–కర్ణాటక తగువులు



















