Botsa Satyanarayana Fired on Goa Governor : గోవా గ‌వ‌ర్నర్ కామెంట్స్ బొత్స సీరియ‌స్

ఆయ‌న‌కు అహంకారం పెరిగిందంటూ ఫైర్

Hello Telugu - Botsa Satyanarayana Fired on Goa Governor

Hello Telugu - Botsa Satyanarayana Fired on Goa Governor

Botsa Satyanarayana : విశాఖ‌ప‌ట్నం : మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ (Botsa Satyanarayana) సీరియ‌స్ కామెంట్స్ చేశారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. రుషికొండ రిసార్ట్స్ ను మెంటల్ హాస్పిటల్ చేయాలన్న వ్యాఖ్యలపై బొత్స ఫైర్ అయ్యారు. గ‌వ‌ర్న‌ర్ అశోక్ వ్యాఖ్యలు అహంకారం, అహంభావానికి నిదర్శనం అన్నారు.. అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి నిదర్శనం అన్నారు మాజీ మంత్రి. కూటమి ప్రభుత్వం ఎటువంటి వారికి గవర్నర్ పదవి ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.

Botsa Satyanarayana Slams Ashok Gajapathi Raju

ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింద‌ని ఆరోపించారు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు నిధులు విడుదల కాని కారణంగా పేదలకు వైద్యం అందడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం 6 వేల కోట్లు ఖర్చు చేయదా అని ప్ర‌శ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేట్ విధానంపై ప్రభుత్వం పునః సమీక్షించాలని అన్నారు. యూరియా కోసం అడిగితే సీఎం చంద్రబాబు బెదిరిస్తున్నారని మండిప‌డ్డారు. ప్రభుత్వం అవినీతి కారణంగానే యూరియా కొరత వచ్చిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దీనికి బాధ్య‌త వ‌హించాల్సింది కూట‌మి స‌ర్కారేన‌ని పేర్కొన్నారు . రైతులు రోడ్డెక్కినా ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ లోకి వెళుతున్నా చ‌ర్య‌లు తీసుకోలేద‌ని అన్నారు. సీఎం చంద్ర‌బాబు నిద్ర పోతున్నాడ‌ని ఫైర్ అయ్యారు.

Also Read : Japam PM Shigeru Resignation Shocking : జ‌పాన్ ప్ర‌ధాని షిగేరు ఇషిబా రాజీనామా

Exit mobile version