Kushboo : చెన్నై – తనపై నమ్మకం ఉంచి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు ప్రముఖ నటి ఖుష్బూ సుందర్. తనను తమిళనాడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా నియమించింది బీజేపీ హైకమాండ్. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా ఖుష్బూ సుందర్ (Kushboo) మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. తనకు ప్రయారిటీ ఇవ్వడం పట్ల ఆనందంగా ఉందన్నారు. ఇది తన పనితీరుకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.
Popular Actress Kushboo as a
ఇదిలా ఉండగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ వెల్లడించారు. మాజీ ఎంపీలు, వీపీ దురైసామి, కేపీ రామలింగం, శశికళ పుష్ప, ఎం చక్రవర్తి సహా ఇతరులు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారని, ఈ నియామకాలను జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆమోదించారని నాగేంద్రన్ పేర్కొన్నారు.
కేశవ వినాయకన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థ)గా కొనసాగుతున్నారని తెలిపారు. ప్రొఫెసర్ రామ శ్రీనివాసన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండగా, కరాటే ఆర్ త్యాగరాజన్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. 45 మంది రాష్ట్ర స్థాయి ఆఫీస్-బేరర్ల పేర్లు కూడా ఉండడం విశేషం. వీరిలో ఎక్కువ మంది తమ పదవులను నిలుపు కోవడం విశేషం. కాగా 2025 ఏప్రిల్‌లో బిజెపి తమిళనాడు యూనిట్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు నైనార్ నాగేంద్రన్. మరో వైపు ఖుష్బూ సుందర్ 2020లో కాంగ్రెస పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా రాజీనామా చేశారు.
Also Read : Minister Kandula Durgesh Proven : ఆగస్టు 1న గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన
