Deepak Reddy : హైదరాబాద్ : తెలంగాణ జనసేన పార్టీ సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు ప్రకటించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్ బరిలో ఉండగా భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో ఆయన స్థానంలో తన భార్య మాగంటి సునీతను పోటీలో నిలిపారు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి లంకాల దీపక్ రెడ్డి (Deepak Reddy) రంగంలో నిలిచారు. ఈ సందర్బంగా ఏపీలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసి గతంలో పోటీ చేశాయి. పవర్ లోకి వచ్చాయి.
BJP Deepak Reddy Gets Support from Janasena
దీంతో తెలంగాణలో సైతం కూడా బీజేపీకి మద్దతు ఇవ్వాలని పార్టీ చీఫ్ , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. రామచందర్ రావుతో పాటు కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేశారు శంకర్ గౌడ్. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరపున బీజేపీ నిలబెట్టిన లంకాల దిలీప్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని తమ పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తమ కూటమి గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Hero Allu Arjun Atlee Movie : ‘అట్లీ బన్నీ’ మూవీకి సాయి అభ్యాంకర్ మ్యూజిక్


















