BJP Chief : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు (BJP Chief) సంచలన ఆరోపణలు చేశారు.
తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. నిజాం పాలనలో జరిగిన నిరంకుశ పాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో పునరావృతం అవుతోందన్నారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చి, అమ్మవారి విగ్రహాన్ని అపహరించి, బోనాలు పగలగొట్టి, హిందువులను చిత్రహింసలకు గురిచేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు బీజేపీ చీఫ్. ఇప్పుడు అమ్మవారికి పూజలు చేయనివ్వకుండా అడ్డుపడుతోందని మండిపడ్డారు.
Telangana BJP Chief Shocking
పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కాపాడుకునేందుకు బిజెపి – హిందూ సమాజం సాగించిన ఉద్యమం విజయవంతమై, అమ్మ వారి గుడి పునర్నిర్మాణం జరిగిందని భరించలేక పోతోందన్నారు. తమ ఓటమిని – హిందువుల విజయాన్ని ఓర్వలేక, తిరిగి హిందూ ఆరాధనపై కుట్రలు పన్నుతోందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రామచందర్ రావు. ఈ ప్రభుత్వం, ఈరోజు పెద్దమ్మ తల్లికి కుంకుమార్చన చేసి భారీగా తిరంగా పతాక ర్యాలీని ప్రారంభించేందుకు పిలుపు ఇచ్చానని చెప్పారు. కానీ అకారణంగా తనను అక్కడికి వెళ్లనీయకుండా హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపించారు. తనను గృహ నిర్బంధం చేయడం అంటే హిందూ సమాజంపై యుద్ధం ప్రకటించినట్లేనని ప్రకటించారు.
నా ఆరాధ్య దైవానికి పూజ చేయడం, జాతీయ పతకాన్ని గర్వంగా ఎత్తుకొని తిరగడం నా ప్రాథమిక హక్కు.. దాన్ని నా నుండి ఎవ్వరూ తీసుకోలేరు, ఆపలేరని వార్నింగ్ ఇచ్చారు రామచందర్ రావు.
Also Read : Rahul Gandhi Fired on EC : ఈసీపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్

















