హైదరాబాద్ : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. పేరుకే కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కనుసన్నలలో ప్రస్తుతం రేవంత్ పాలన సాగిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఖజానాకు చిల్లులు పడేలా ఏపీకి చెందిన రిటైర్డ్ అయిన వారిని తెలంగాణలో పలు కీలక పదవులలో నియమంచడం పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా ఏపీలో పని చేసిన ఆదిత్యనాథ్ ను తీసుకు వచ్చి తెలంగాణ లో నీటి పారుదల శాఖకు సలహాదారుగా నియమించారు సీఎం. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పలు తెలంగాణ మేధావులు.
తాజాగా తీసుకున్న మరో నిర్ణయం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇప్పటికే ఉన్న సలహాదారుడికి మరో ఇద్దరు సలహాదారులను నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం.నీటిపారుదల శాఖలో ఆంధ్రప్రదేశ్ వాసి అయిన ఆదిత్య నాథ్ దాస్ ఇప్పటికే సలహాదారుడిగా పనిచేస్తుండగా, ఇప్పుడు ఆయనకు మరో ఇద్దరు సలహాదారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విస్తు పోయేలా చేసింది. ప్రభుత్వం, రిటైర్డ్ ఇంజనీర్లు జె. సత్యానంద్ , డి. విష్ణు కుమార్ శర్మలను మార్చి 31, 2027 వరకు ఆదిత్య నాథ్ దాస్‌కు సలహాదారులుగా నియమించింది .జె. సత్యానంద్‌ను టెక్నికల్ అసిస్టెంట్‌గా, డి. విష్ణు కుమార్ శర్మను ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా నియమించడాన్ని ఉన్నతాధికారులు వ్యతిరేకిస్తున్నారు
గతంలో సత్యానంద్ జల యజ్ఞం ప్రాజెక్ట్, ప్రాణహిత-చెవెల్లా ప్రాజెక్టులపై పనిచేసినప్పుడు, ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆయన ప్రతి పనిలోనూ అవినీతికి పాల్పడ్డారని గుర్తుచేస్తూ, అలాంటి వ్యక్తిని సలహాదారుడిగా ఎలా నియమించారని ప్రశ్నిస్తున్నారు.
















