DK Shivakumar : కర్ణాటక : బెంగళూరులో మౌలిక సదుపాయాల కల్పనపై కొనసాగుతున్న వివాదానికి చెక్ పెట్టేందుకు ఫోకస్ పెట్టింది బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందర్ షా . ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తో మంగళవారం భేటీ అయ్యారు. తను ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్నారు. స్వయంగా షా డిప్యూటీ సీఎం నివాసంలో కలుసుకున్నారు. ఈ కీలక సమావేశంలో వారు బెంగళూరు వృద్ధి, ఆవిష్కరణ లలో ముందుకు వెళ్లే మార్గాల గురించి చర్చించారు. ఇదే విషయాన్ని డీకే శివకుమార్ స్వయంగా ఎక్స్ వేదికగా స్పందించారు.
Biocon Chief Meet DK Shivakumar
ఇవాళ తన నివాసంలో బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా గతంలో అనేక సందర్భాల్లో నగరంలోని మౌలిక సదుపాయాల సమస్యలపై నిరాశ వ్యక్తం చేశారు. పేలవమైన రోడ్ పరిస్థితులు, చెత్త నిర్వహణ సమస్యలను ఉదహరించారు. సకాలంలో చెత్త తొలగింపు, రోడ్డు పునరుద్ధరణ అవసరాన్ని ఆమె నొక్కిచెప్పారు. ప్రభుత్వ మంత్రులను జవాబుదారీగా ఉంచారు. బెంగళూరు మౌలిక సదుపాయాల గురించి ప్రశ్నలు లేవనెత్తిన బయోకాన్ పార్క్ పర్యటన తర్వాత ఆమె వ్యాఖ్యలు చేశారు. ‘రోడ్లు ఎందుకు అంత దారుణంగా ఉన్నాయి. చుట్టూ ఇంత చెత్త ఎందుకు ఉంది? ప్రభుత్వం పెట్టుబడికి మద్దతు ఇవ్వకూడదని అనుకుంటున్నారా? అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు షా.
Also Read : Mallikarjun Kharge Shocking Comments : బాంబు పేల్చిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే



















