Bill Gates : కృత్రిమ మేధస్సు (AI) వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు లేఆఫ్‌లకు పాల్పడడంతో ఈ భయాలు మరింతగా ఊపందుకున్నాయి. అయితే, ఏఐ కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) పేర్కొన్నారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, “ఏఐ ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత పెరుగుతుంది, పనిని మరింత నైపుణ్యంతో చేయగలుగుతాం. అయితే ఈ మార్పు ఊహించిన దానికంటే వేగంగా జరుగుతుంది” అని అన్నారు. ఆయన మాటల్లో, భవిష్యత్తులో వైట్ కాలర్ ఉద్యోగాలు మాత్రమే కాకుండా బ్లూ కాలర్ ఉద్యోగాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
Bill Gates – ఏఐ కారణంగా ఉద్యోగ మార్పులు
2023లోనే ఆంత్రోపిక్ CEO డారియో అమోడీ హెచ్చరించినట్లు, వైట్ కాలర్, ఎంట్రీ లెవల్ ఉద్యోగాలలో సగం వరకు ఏఐ కారణంగా కనుమరుగయ్యే అవకాశం ఉందని గేట్స్ (Bill Gates) గుర్తుచేశారు. అయినప్పటికీ, ఈ సాంకేతిక పరిణామం కొత్త వృత్తులు, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
ఉత్పాదకతను మానవ కోణంలో చూడాలి
ఏఐని కేవలం ఆర్థిక ఉత్పత్తి పరంగా కాకుండా, ప్రజలు తమ దైనందిన పనుల నుండి విముక్తి పొందే సాధనంగా కూడా ఉపయోగించుకోవచ్చని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన AI గ్లోబల్ లీడర్‌షిప్ ప్లాన్ ఈ దిశగా ముఖ్యమైన అడుగు అని అన్నారు.
మూడు రంగాలు తక్కువ ప్రమాదంలో
ఏఐ ప్రభావం తక్కువగా ఉండే రంగాలుగా గేట్స్ మూడు విభాగాలను పేర్కొన్నారు:
- కోడింగ్ (Coding)
- ఎనర్జీ మేనేజ్‌మెంట్ (Energy Management)
- బయాలజీ (Biology)
ఈ రంగాలు మానవ ఆలోచన, సృజనాత్మకత అవసరమయ్యే క్రమంలో ఏఐ ఆటోమేషన్‌ను తట్టుకొని నిలబడతాయని ఆయన అంచనా వేశారు.
ఏఐ అభివృద్ధి ఆశ్చర్యానికి గురి చేసింది
ఏఐ వేగవంతమైన అభివృద్ధి తనను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని గేట్స్ తెలిపారు. “నేను ఫిజిక్స్‌లో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నిపుణులను అడుగుతాను. కానీ ఇప్పుడు ఏఐ ఇచ్చిన సమాధానాలు చూసి నిపుణులే ‘ఇక మమ్మల్ని అవసరం లేదు’ అని చెప్పడం అద్భుతం,” అని ఆయన వ్యాఖ్యానించారు.
వెనుకబడిన దేశాలకు ఏఐ దోహదం
ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగ నైపుణ్యాల అభివృద్ధికి ఏఐ ఉపయోగపడుతుందని గేట్స్ (Bill Gates) వివరించారు. తాము ఓపెన్‌ఏఐతో కలిసి వెనుకబడిన దేశాలకు అనుకూలమైన టూల్స్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ చొరవ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది, అభివృద్ధి అంతరాలను తగ్గిస్తుంది అని అన్నారు.
యువతకు గేట్స్ సూచనలు
ఏఐ యుగంలో యువత ఎదుర్కొంటున్న సవాళ్లపై మాట్లాడుతూ, “ఏఐని భయపడకండి, దాన్ని సాధికారత, వృద్ధికి సాధనంగా మార్చుకోండి” అని బిల్ గేట్స్ పిలుపునిచ్చారు.
ఏఐని తెలివిగా వినియోగిస్తే ఉత్పాదకత పెరుగుతుందని, సమయం ఆదా అవుతుందని, తద్వారా ఉద్యోగాల నష్టం తగ్గుతుందని ఆయన సూచించారు.
Also Read : Stock Market Sensational : నేడు సెన్సెక్స్ 153 పాయింట్ల నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్



















