Bilawal Bhutto : పాకిస్తాన్ – ఆపరేషన్ సిందూర్ తో షాక్ తగిలినా పాకిస్తాన్ తో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇప్పటికే ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు భారత్ కు . అణ్వాయుధాలు ప్రయోగిస్తామంటూ పేర్కొన్నాడు. ఆయనకు మద్దతుగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో (Bilawal Bhutto) మంగళవారం కీలక ప్రకటన చేశాడు. భారతదేశం సింధు జల ఒప్పందాన్ని నిలిపి వేస్తూనే ఉంటే, పాకిస్తాన్ యుద్ధం గురించి ఆలోచించడం తప్ప వేరే మార్గం ఉండదని స్పష్టం చేశాడు. ఇటీవల మూడు దశాబ్దాల నాటి సిందూ జల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందంటూ ఆరోపించాడు. దీని కారణంగా తమ దేశానికి తీరని నష్టం వాటిల్లిందని, దీనికంతటికీ ఇండియానే కారణం అంటూ విషం వెళ్లగక్కాడు. ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా పాకిస్తానీయులంతా ఏకం కావాలని పిలుపునిచ్చాడు.
Bilawal Bhutto Slams
మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం కలిగించాయి. దీనిని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు బిలావల్ భుట్టో. పాకిస్తానీలను తక్కువ అంచనా వేస్తే ఎలా అని ప్రశ్నించారు. భారతీయుల కంటే పాకిస్తానీయులు మరింత బలంగా ఉన్నారని అన్నారు భుట్టో . భారతదేశం ఈ మార్గంలో కొనసాగితే మన జాతీయ ప్రయోజనాలను కాపాడు కోవడానికి యుద్ధంతో పాటు మిగతా ఎంపికలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు . తాము యుద్దాన్ని ప్రారంభించ లేదని, కానీ సిందూర్ లాంటి దాడులకు పాల్పడాలని మీరు ఆలోచిస్తూ వుంటే మేం తలవంచే ప్రసక్తి లేదన్నారు బిలావల్ భుట్టో.
Also Read : CM Chandrababu Strong Focus : మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్

















