ముంబై : బుల్లి తెరపై దుమ్ము రేపుతూ జనాదరణ పొందిన రియాల్టీ షో బిగ్ బాస్ హిందీ సీజన్ 20 గురించి కీలక అప్ డేట్ వచ్చేసింది. దీనికి ప్రముఖ నటుడు, కండల వీరుడిగా పేరు పొందిన సల్మాన్ ఖాన్ మరోసారి హోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ షోకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది ఇవాళ. ఈ మేరకు బిగ్ బాస్ హిందీ సీజన్ 20 సెప్టెంబర్ 6న ప్రారంభం కానుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ మైలురాయి వంటి సీజన్ కోసం జియో హాట్‌స్టార్ , కలర్స్ ఛానెల్ టీజర్‌ను విడుదల చేస్తే సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా తిరిగి వస్తున్నారు. ఈ పాపులర్ రియాలిటీ షో ప్రత్యేకమైన ఎడిషన్ సెప్టెంబర్ 6న ప్రారంభం కానుందని టీజర్ ధృవీకరించింది. ఈ టీజర్ ద్వారా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా తిరిగి రాకను చాటిచెప్పారు. ఒక రాజసం ఉట్టిపడే గుర్రంపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన కరణ్ అర్జున్ చిత్రంలో జరిగినదే ఇప్పుడు బిగ్ బాస్‌లో జరగబోతోంది అనే ఆసక్తికరమైన డైలాగ్‌ను పలికారు.
ఈ డైలాగ్ టీజర్‌లోని సూక్ష్మ దృశ్య సంకేతాలు, కొత్త సీజన్లో ప్రధానాంశంగా మారబోయే ఒక రహస్యాన్ని సూచిస్తున్నాయి. రాబోయే సీజన్ గురించి మాట్లాడుతూ, బిగ్ బాస్ ప్రతి సీజన్ కొత్త ఆట, కొత్త సమీకరణాలు , ఊహించని మలుపులను తెస్తుందని, అయితే సీజన్ 20లో ఒక రహస్యం అంతర్లీనంగా ఉండి దీనిని మునుపటి సీజన్ల కంటే భిన్నంగా మారుస్తుందని సల్మాన్ ఖాన్ అన్నారు. టీజర్లో మొదటి క్లూ ఉందని, ప్రేక్షకులు దానిని నిశితంగా గమనించి, షో ప్రారంభమైనప్పుడు ఆ రహస్యాన్ని అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. నిర్వాహకులు పోటీదారులు, షో ఫార్మాట్‌కు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు, దీనివల్ల ఈ ప్రత్యేక సీజన్ పట్ల ఆసక్తి మరింత పెరిగింది.



















