హైదరాబాద్ : తెలుగు బుల్లితెరపై దుమ్ము రేపుతోంది అక్కినేని నాగార్జున యాంకర్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ 10 రియాల్టీ షో రోజు రోజుకు మరింత ఉత్కంఠను రేపుతోంది. తాజా ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ ప్రక్రియలో ఒక పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక కంటెస్టెంట్‌ను కాపాడే అవకాశం కెప్టెన్ ముఖేష్‌కు లభించింది. కానీ దానికి బదులుగా అతను తన కెప్టెన్సీ , ఇమ్యూనిటీని వదులుకోవాల్సి వచ్చింది. డేంజర్ జోన్‌లో ఉన్న వర్షిణి , వంశీలను కాపాడటానికి ముఖేష్ ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ఇంట్లోనే ఉండటం కోసం అతను తన కెప్టెన్సీ , ఇమ్యూనిటీని త్యాగం చేయడానికి అంగీకరించాడు. ఫలితంగా ఈ వారం ఎలిమినేషన్ జరగలేదు.
ముఖేష్ నిర్ణయం మూడు షరతులతో కూడి ఉంది. అతను కెప్టెన్సీని వదులు కోవాలి, తన ఇమ్యూనిటీని కోల్పోవాలి . తదుపరి ఎలిమినేషన్‌కు నేరుగా నామినేట్ కావాలి. ఈ షరతులు ఉన్నప్పటికీ, అతను కంటెస్టెంట్లను కాపాడాలని ఎంచుకున్నాడు. ముఖేష్ త్యాగం తరువాత, అపూర్వ బిగ్ బాస్ హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా మారేలా చేసింది. ముకేష్‌తో కలిసి గతంలో కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచినందున ఆమెకు ఇమ్యూనిటీ ప్రయోజనం కూడా లభించింది . ఈ ఊహించని నిర్ణయం ఇంట్లో ఒక కొత్త పరిస్థితిని సృష్టించింది. ఇప్పుడు ముకేష్ ప్రత్యక్ష నామినేషన్ ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, అపూర్వ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించింది. రాబోయే రోజుల్లో ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
