Big Boss 9 : బుల్లి తెరపై మరోసారి సందడి చేసేందుకు రెడీ అవుతోంది బిగ్ బాస్ రియాల్టీ షో. ప్రస్తుతం జరుగుతున్నది తొమ్మిదవది. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. తాజాగా బిగ్ బాస్ -9కి (Big Boss 9) సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ జాబితాను ఖరారు చేశారు నిర్వాహకులు. ఈసారి ఎవరు హోస్ట్ చేస్తారనేది మాత్రం ఇంకా సస్పెన్స్ లో ఉంచారు. అయితే ఈసారి కూడా మన్మథుడే షో నిర్వాహకుడిగా ఉంటారని టాక్.
Big Boss 9 Key Update
తను ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉన్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర లో కీలక పాత్ర పోషించాడు. ఇందులో ధనవంతుడికి భిక్షగాడికి మధ్య నడిచే ఆసక్తికరమైన సన్నివేశాలతో కూడిన కథే మూవీ. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ. 100 కోట్ల మార్క్ ను దాటేసింది. ప్రస్తుతం అక్కినేని నాగార్జున మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు తమిళ సినిమాలో. తను సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న మూవీ కూలీ. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో అత్యధిక ధరకు అమ్ముడు పోయింది ఈ మూవీ. ఏకంగా రూ. 80 కోట్లకు తీసుకున్నారు.
బిగ్ బాస్ 9 (Big Boss 9) సెప్టెంబర్ మొదటి వారంలో జియో హాట్‌స్టార్, స్టార్ MAAలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉండవచ్చని అంచనా. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఉన్న బిగ్ బాస్ హిందీలో అభిమానులు ఎలా చేశారో, అదే విధంగా ప్రోమోతో త్వరలో అధికారిక నిర్ధారణను ఆశించవచ్చు. అలేక్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశిస్తారని టాక్. శ్రీతేజ, పరమేశ్వర్ హివ్రాలే , యాంకర్ రమ్య కృష్ణ, జానపద నృత్యకారిణి నాగ దుర్గ, నటి రీతు చౌదరి, జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయేల్, తేజస్విని గౌడ, నవ్య స్వామి, కల్పికా గణేష్, సుమంత్ అశ్విన్ కూడా ఉన్నారు.
Also Read : Saiyaara Success Updates : ప్రేమ కథా సమ్మేళనం కాసుల వర్షం

















