తిరుపతి : మానవ సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి భగవద్గీతకు ఉందని హెచ్డిపిపి కార్యదర్శి శ్రీరాం రఘునాథ్ అన్నారు. టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో భగవద్గీత శ్లోకాల కంఠస్తం పోటీలు నిర్వహించింది. ఈ సందర్బంగా విజయం సాధించిన విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కోణంలో మనిషి ఎలా జీవించాలో భగవద్గీత తెలియ జేస్తుందన్నారు. చెడు మీద మంచి విజయం సాధించడమే గీతా సారాంశమన్నారు.
చిన్న వయస్సులోనే భగవద్గీత శ్లోకాలను శాస్త్రబద్ధంగా పఠించడం, దానిలోని సందేశం అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించ వచ్చని తెలిపారు. అనంతరం గీతా జయంతి వేడుకలలో మొదటి విభాగం నందు ప్రథమ బహుమతి పొందిన ముకుంద, ద్వితీయ స్థానంలో నిలిచిన ముకుంద, మూడో ప్లేస్ ను దక్కించుకున్న ఎం. వైష్ణవిని అభినందించారు. వారికి జ్ఞాపికలను అందజేశారు. రెండో విభాగంలో తొలి, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచారు డి. నిశాంత్ చక్రవర్తి, ఎం. జస్వంత్, ఎస్. నాగవేణి, మూడో కేటగిరీలో ప్రథమ స్థానంలో వెంకట నారాయణ, ద్వితీయ ప్లేస్ లో లహరి, మూడో స్థానంలో ఎస్ ఉమా మహేశ్వరి నిలిచారు.
