Bandaru Sravani : అనంతపురం జిల్లా : ఏపీ కూటమి సర్కార్ విద్యా రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని అన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ (Bandaru Sravani). బుక్కరాయ సముద్రం మండలం దేవరకొండ సమీపంలో నూతన ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్, ఆర్ అండ్ బి తారు రోడ్డు ఏర్పాటుకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి శిలాఫలకం ఆవిష్కరించి, భూమి పూజ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం జి.జి.యూ.ఏ. పథకం కింద నూతన గిరిజన గురుకుల పాఠశాల (బాలురు) నిర్మాణం కోసం రూ. 5.38 కోట్లు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. బుక్కరాయ సముద్రం నుంచి గూగూడు వరకు వయా ఏడావులపర్తి, బి పప్పూరు రోడ్డుకు 19 కి.మీ. పొడవునా రూ.2.50 కోట్లు వెచ్చించి తారు రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని చెప్పారు.
MLA Bandaru Sravani Key Comments
అందులో భాగంగానే గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో డొక్కా సీతమ్మ భోజన పథకం కింద నాణ్యమైన ఆహారం అందించడం జరుగుతోందని అన్నారు. అంతేకాకుండా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లు విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యాలయాల్లో రాజకీయ రంగులు, గుర్తులు లేకుండా మహనీయుల గురించి విద్యా బోధన, సౌకర్యాల కల్పన జరుగుతోందన్నారు. దశాబ్దాలుగా బుక్క రాయసముద్రం నుంచి గూగూడు వరకు వయా ఏడావులపర్తి, బి. పప్పూరు మీదుగా తగిన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే తారు రోడ్డు మంజూరు కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : KTR Strong Request : ఆడబిడ్డను ఆదరించండి గెలిపించండి
















