Bandlaguda : హైదరాబాద్ : వినాయక చవితి ముగిసింది. ఆదివారం నాటితో రాష్ట్ర వ్యాప్తంగా, ప్రధానంగా హైదరాబాద్ లో రెండున్నర లక్షలకు పైగా గణనాథులను నిమజ్జనం చేశారు. హుస్సేన్ సాగర్ తో పాటు ప్రధాన చెరువులు, నదులలో వాటిని జారవిడిచారు. వేలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పెద్ద ఎత్తున ఈసారి తెలంగాణ ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసింది. దీని కారణంగా సర్కార్ కు దాదాపు రూ. 25 కోట్లకు పైగా భారం పడింది. ఇదిలా ఉండగా వినాయక చవితి సందర్బంగా వినాయక విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున లడ్డూ ప్రసాదాలను ఏర్పాటు చేశారు.
Bandlaguda Ganesh Laddu Price
ఇదిలా ఉండగా నగరంలో ఎప్పటి లాగే ఖైరతాబాద్ లో గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 72 అడుగుల భారీ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు మధ్య , వేలాది మంది భక్తులు తరలి రాగా గణనాథుడిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. ఇదిలా ఉండగా ఈ వినాయకుడి వద్ద వేలం పాట అనేది ఉండదు. ఇక కోరిన కోర్కెలు తీర్చే వినాయకుడిగా గుర్తింపు పొందారు బాలాపూర్ గణనాథుడు. ఈసారి కర్మన్ ఘాట్ కు చెందిన బీజేపీ నాయకుడు గౌడ్ రూ. 35 లక్షలకు చేజిక్కించుకున్నాడు. ఇక ఎవరూ ఊహించని విధంగా బండ్లగూడలోని (Bandlaguda) రిచ్ మండ్ విల్లాస్ లో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ వేలం పాట రికార్డ్ సృష్టించింది. ఏకంగా రూ. 2.32 కోట్లకు అమ్ముడు పోయింది. ఈ వేలం పాట దేశంలో సంచలనం కలిగించింది.
Also Read : Amreen Gets Ganesh Laddu Interesting : గణేశ్ లడ్డూని చేజిక్కించుకున్న ముస్లిం మహిళ
















