కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్క‌టే : బండి సంజ‌య్

క‌రీంన‌గ‌ర్ జిల్లా అభివృద్దిని చూసి భారీగా చేరిక

hellotelugu-BandiSanjjay

క‌రీంన‌గ‌ర్ జిల్లా : కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్క‌టేన‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు ముందుకు తెస్తున్న‌రాంటూ మండిప‌డ్డారు. పైకి ఒక‌రిపై మ‌రొక‌రు తిట్టుకుంటున్నార‌ని, లోప‌ల అంత‌టా ఇరు పార్టీలు ఒక్క‌టేన‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇదిలా ఉండ‌గా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులు, అమృత్ నిధులు, ఇతర నిధులతో కరీంనగర్ కార్పొరేషన్లో జరుగుతున్న అభివృద్ధి, బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 46వ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నేత వెంకట్ రెడ్డి ఆధ్వర్వంలో పలువురు కాంగ్రెస్ నేతలతోపాటు బీఆర్ఎస్ కు సంబంధించి 10వ డివిజన్ కు చెందిన సాగాని కొమరయ్య , 30వ డివిజన్ కు చెందిన నక్క రాజేశ్వరరావు , 48వ డివిజన్ కు చెందిన కర్రి అనిల్ కుమార్ , 4వ డివిజన్ కు చెందిన దుర్శేడు మురళి , 47వ డివిజన్ కు చెందిన శ్రీరాం నరేందర్ తమ వందలాది మంది అనుచరులతో బీజేపీలో చేరారు.

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం చేసుకొని బీజేపీని ఓడించాలని కుట్ర పన్నాయని ఆరోపించారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. చైతన్యవంతులైన కరీంనగర్ ప్రజలు ఈ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సారి కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపి అభ్యర్థులందరినీ గెలిపించి, మేయర్ పీఠాన్ని బీజేపి కి ఇవ్వాలని కోరారు  . మీ సహకారంతో కరీంనగర్ ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.

Exit mobile version