Bandi Sanjay : హైదరాబాద్ – కేంద్ర మంత్రి బండి సంజయ్ భగ్గుమన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా ఒప్పుకోమంటూ స్పష్టం చేశారు. బీసీలకు అన్యాయం చేసి ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. కామారెడ్డిలో రాహుల్ గాంధీ ప్రకటించింది కామారెడ్డి డిక్లరేషన్ కాదు ముస్లిం డిక్లరేషన్ అంటూ మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే మద్దతిస్తామని ప్రకటించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బీసీని ప్రధానిని చేశారా అని ప్రశ్నించారు. బుధవారం బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 48 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్క బీసీనైనా ముఖ్యమంత్రిని చేసిందా అని నిలదీశారు. కానీ తమ భారతీయ జనతా పార్టీ మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు.
Union Minister Bandi Sanjay Slams Congress
దేశంలోని 27 మంది ఎంపీలను మంత్రులుగా చేసిందని చెప్పారు. అంతే కాకుండా అనేక రాష్ట్రాలకు బీసీలను ముఖ్యమంత్రులుగా నియమించిన ఘనత తమ పార్టీదేనని స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్. ఈ దేశాన్ని అన్ని రంగాలలో నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలకు పాల్పడింది, స్కాంలకు కేరాఫ్ గా మారింది మీరే కాదా అంటూ ఫైర్ అయ్యారు. ఇవాళ ప్రపంచలోనే అత్యం వేగవంతమైన ఆర్థిక దేశంగా పరుగులు పెడుతోందని, దీనికి ప్రధాన కారకుడు బలమైన, సమర్థవంతమైన నాయకత్వ పటిమ కలిగిన ప్రధాని నరేంద్ర మోదీ ఉండడమేనని అన్నారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకుంటే బెటర్ అని కాంగ్రెస్ పార్టీకి సూచించారు బండి సంజయ్ కుమార్.
Also Read : Minister Ramanaidu Proven : చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందిస్తాం


















