YS Sharmila : విజయవాడ – ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు చంద్రబాబు నాయుడుకు ఏటీఎం లాగా మారిందన్నారు. అడ్వాన్స్ మొబైలైజేషన్ కోసమే తెరమీదకు బనకచర్ల తీసుకు వచ్చారని అన్నారు. శనివారం వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila) మీడియాతో మాట్లాడారు.
పోలవరం ఇష్యూను డైవర్ట్ చేసేందుకు బనకచర్ల అంటూ బాబు తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
అటవీ శాఖ అనుమతులు రావని తనకు బాగా తెలుసన్నారు. అన్ని అనుమతులు వచ్చాక పార్లమెంట్ వేదికగా 80 వేల కోట్లు కేంద్రం ఇస్తున్నట్లు హామీ ఉండాలన్నారు.
YS Sharmila Shocking Comments on CM Chandrababu
అప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ సంగతి తేల్చాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్. జలయజ్ఞం కింద గాలేరు – నగరి, హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. YSR ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం కోసం COA ను కలిశామన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. నెలరోజుల్లో సమస్య పరిష్కరించకుంటే డిల్లీకి వెళ్లి కలుస్తామన్నారు. గత ప్రభుత్వ హయంలో COA అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకున్నారని, ఇప్పుడు స్టూడెంట్స్ కు సర్టిఫికెట్లు రావడం లేదని వాపోయారు.
వందలాది మంది విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరంగా మారాయని వాపోయారు. COA అనుమతులు లేకుండా లైసెన్సులు రావడం లేదన్నారు. ఈ తప్పు సరిదిద్దాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉందని స్పష్టం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. కేంద్రం 25 వేల కోట్ల మిగులు కోసం ప్రాజెక్ట్ ను ముంచేశారని ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి.
Also Read : Banakacherla – GRMB Warning : బనకచర్ల నీటి మళ్లింపుపై జీఆర్ఎంబీ అభ్యంతరం
















