Actor Babu Mohan – Kota Death : కోట‌న్న‌ను కోల్పోయాన‌న్న బాబు మోహ‌న్

బోరున విల‌పించిన క‌మెడియ‌న్

Hello Telugu - Actor Babu Mohan - Kota Death

Hello Telugu - Actor Babu Mohan - Kota Death

Babu Mohan : హైద‌రాబాద్ – కోట శ్రీనివాసరావు మరణం గురించి తెలియగానే బోరున విలపించారు బాబు మోహన్ (Babu Mohan). తనకు అన్నం తినిపించే అన్న ఇక లేడంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. కోటన్న మరణం తనకు తీరని లోటు అని, త‌న‌ను సొంత త‌మ్ముడి కంటే ఎక్కువ‌గా చూసుకునే వాడంటూ వాపోయాడు. ఆయ‌న మ‌ర‌ణం త‌న‌ను తీవ్రంగా క‌లిచి వేసింద‌న్నాడు. తాము ఇద్ద‌రం క‌లిసి ఎన్నో సినిమాల‌లో న‌టించామ‌ని, ఏనాడూ ప‌ల్లెత్తు మాట త‌న‌ను అన‌లేద‌ని, అక్కున చేర్చుకున్నాడ‌ని ప్ర‌శంసించారు. అజాత శ‌త్రువు త‌ను అని కొనియాడారు. ఇవాళ త‌న‌కే కాదు తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని విషాదం అని పేర్కొన్నారు.

Babu Mohan Emotional On Kota’s Death

ఇదిలా ఉండ‌గా కోట శ్రీ‌నివాస రావు సినీ ప్ర‌స్థానం చిరంజీవి న‌టించిన ప్రాణం ఖ‌రీదుతో ప్రారంభ‌మైంది. ఆయ‌న స్వ‌స్థ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా. విలన్ గా, కమెడియన్, తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా, పిసినారిగా, పోలీసుగా ఇలా అద్భుతమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం తర్వాత ఆ లోటును భర్తీ చేశారు.

నటనా ప‌రంగా తెలుగునాట చెరిగిపోని ముద్ర వేశారు కోట శ్రీనివాసరావు. ఆయన నటన చిరస్మరణీయం..అజ‌రామ‌రం. సినీ క‌ళామ‌త‌ల్లి ఉన్నంత వ‌ర‌కు తను వెలుగుతూనే ఉంటారు. ఓవైపు న‌టుడిగా ఇంకో వైపు రాజ‌కీయ నాయ‌కుడిగా ఉన్నా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను నిల‌బెట్టుకున్నారు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో ముఖ్య భూమిక పోషించారు. త‌న‌కు ఎదురే లేద‌ని చాటారు కోట శ్రీ‌నివాస‌రావు. రాష్ట్ర‌, జాతీయ స్థాయిలో అవార్డులు, పుర‌స్కారాలు అందుకున్నారు.

Also Read : Jr NTR – Kota Death : ‘కోట‌’కు మ‌ర‌ణం లేదు – జూనియ‌ర్ ఎన్టీఆర్

Exit mobile version