ముఖీం సోద‌రుడు అజీం అక్ర‌మ నిర్మాణాల చిట్టా

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్

hellotelugu-Hydraa

హైద‌రాబాద్ : హైడ్రా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో కబ్జాదారులకు హైడ్రా కల్లెం వేసిన విషయం విధితమే. న్యాయవాది ముసుగులో ఎం. ఎ. ముఖీం సాగిస్తున్న‌ ఆక్రమణలకు హైడ్రా చెక్ పెట్టింది. దశాబ్దాలుగా ఇష్టా రాజ్యాన్ని నడిపించిన ముఖీంతో పాటు ఆయన అనుచరగణానికి హైడ్రా చెక్ పెట్టింది. దీంతో అ పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఊపిరి పీల్చుకున్నారు. భయభ్రాంతులకు గురి చేసే ముఖీం పీడ విరుగడైందని అక్కడ ఉన్న ఐలాపూర్ తండా, గ్రామ వాసులు సంబరాలు చేసుకుంటుంటే.. ఒకటి, రెండు సామాజిక మాద్యమాలు (సోషల్ మీడియా) ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించడాన్ని హైడ్రా ఖండించింది. ముఖీం సోదరుడు ఎంఏ అజీం దుబాయ్‌లో నివాసం ఉంటున్నాడని తెలిపింది.

షోకాజ్ నోటీసులు, స్పీకింగ్ ఆర్డ‌ర్లు ఏమీ ప‌ట్టించుకోకుండా ఎం.ఎ. అజీం తన అనుచరగణంతో అనుమ‌తులేవీ లేకుండా ప్రభుత్వ భూమిలో నిర్మించిన 6 అంతస్తుల భవన నిర్మాణ దశ నుంచి దానిని కూల్చివేత వరకూ జరిగిన పరిణామాలు ఇలా ఉన్నాయని పేర్కొంది. అమీన్పూర్ మండలం ఐలాపూర్ విలేజ్లోని ప్రభుత్వ భూమిలో ముఖీం సోదరుడు అజీం అపార్టుమెంట్లు కట్టి.. హైడ్రా వచ్చేసరికే అమ్ముకున్నాడని ఆరోపించింది. జులై 19వ తేదీ 2024న హైడ్రా ఏర్పాటయిన విషయం విధితమే. అప్పటి నుంచే ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా న‌డుం బిగించింది.

Exit mobile version