AUS vs IND : పెర్త్ : ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా ఆదివారం జరిగిన కీలక తొలి వన్డే మ్యాచ్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 7 వికెట్ల తేడాతో భారత జట్టును మట్టి కరిపించింది. ఆసిస్ జట్టు స్కిప్పర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తన నిర్ణయం సరైనదేనని తేలి పోయింది. పలు మార్లు వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో అంపైర్లు 50 ఓవర్ల మ్యాచ్ ను 26 ఓవర్లకే పరిమితం చేశారు. దీంతో భారత జట్టు నిర్దేశించిన ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో కేఎల్ రాహుల్ (KL Rahul), అక్షర్ పటేల్ 30, 31 రన్స్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత వన్డే ఫార్మాట్ లోకి వచ్చిన స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ , కెప్టెన్ శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ లు నిరాశ పరిచారు. ఈ తరుణంలో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ లు ఆదుకున్నారు. ఆ తర్వాత హర్షిత్ రాణా కొద్దిసేపు ఆడినా ఫలితం లేకుండా పోయింది.
AUS vs IND 1st ODI Match Updates
ఇక ఇండియా నిర్దేశించిన భారత్ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది ఆస్ట్రేలియా. కేవలం 21.1 ఓవర్లలోనే టార్గెట్ ను రీచ్ చేసింది. మార్ష్ 52 బంతులు ఎదుర్కొని 46 రన్స్ చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాటౌట్ గా నిలిచాడు. డక్ వర్త్ లూయిస్ పద్దతిని ఇక్కడ ఉపయోగించారు అంపైర్లు. వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ 29 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ వియానికి వస్తే ఆస్ట్రేలియా బౌలర్లలో మాథ్యూ 26 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీస్తే జోష్ హాజిల్ వుడ్ 20 రన్స్ ఇచ్చి మరో 2 వికెట్లు తీశాడు. ఓవెన్ 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు.
Also Read : Jajula Srinivas Goud Shocking Comments : రాష్ట్ర బంద్ తో చరిత్ర సృష్టించాం : శ్రీనివాస్ గౌడ్



















