సిడ్నీ : ఆస్ట్రేలియా లోని సిడ్నీ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో దుమ్ము రేపాడు ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్. ఆసిస్, ఇంగ్లండ్ టెస్టు సీరీస్ లో వరుసగా ఇది రెండో శతకం కావడం విశేషం. దీంతో ఆస్ట్రేలియన్ స్టార్ ఆటగాడు రికీ పాంటింగ్‌తో ఆల్-టైమ్ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు ఇంగ్లాండ్ జట్టుకు చెందిన జో రూట్ . ఇదిలా ఉండగా సీరీస్ లో భాగంగా ఇది ఆఖరి ఐదో టెస్టు మ్యాచ్. సిడ్నీ లోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆసిస్, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రారంభమైన మ్యాచ్ లో తన జట్టుకు అండగా నిలబడ్డాడు జో రూట్. రెండో రోజున 100 రన్స్ చేయడంతో సంతోషానికి లోనయ్యాడు. అద్భుతమైన టెక్నిక్, ఆకట్టుకునేలా షాట్స్ ఆడాడు జో రూట్. ఇదే సమయంలో తను 160 రన్స్ చేశాడు.
తన వయసు 35 ఏళ్లు. తన క్రికెట్ కెరీర్ లో ఈ సెంచరీని మరిచి పోలేనని పేర్కొన్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్.
భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు జో రూట్. తను 242 బంతులు ఆడాడు. ఇందులో 15 ఫోర్లు ఉన్నాయి. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 384 రన్స్ చేసేందుకు సహాయ పడ్డాడు. కీలక పాత్ర పోషించాడు రూట్. అయితే 39 ఏళ్లకు తాను క్రికెట్ నుంచి నిష్క్రమించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అప్పటి వరకు ఇదే గ్రౌండ్ లో తాను వీడ్కోలు పలికేలా ఆ దేవుడు అవకాశం ఇస్తాడని కోరుకుంటున్నట్లు చెప్పాడు.



















