ATC Police : హైదరాబాద్ : దేశంలో ఎక్కడ పేలుళ్లు, ఇతర సంఘటనలు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్ లో ఉంటున్నాయి. ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు (ATC Police) నగరానికి వచ్చారు. రాజేంద్రనగర్ లో ఏటీఎస్ పోలీసులు సోదాలు చేపట్టారు. ఫోర్త్ వ్యూ కాలనీలోని డా.సయ్యద్ మొహియుద్దీన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం ఇందులో పాల్గొంది. మూడు రకాల లిక్విడ్‌తో పాటు కంప్యూటర్, పలు రకాల బుక్స్, ఆయిల్ తయారు చేసే మిషన్ సహా పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు సోదాలలో భాగంగా. సయ్యద్ సోదరుడు ఓమర్ ఫారుఖీకి నోటీసులు ఇచి సెర్చ్, సామాగ్రి సీజ్ చేశారు. ఇదిలా ఉండగా డాక్టర్ సయ్యద్ అనుమానిత టెర్రర్ మాడ్యూల్ లో సభ్యుడని ఏటీఎస్ పోలీస్ వెల్లడించింది.
ATC Police Investigation
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు చేపట్టేందుకు ప్రాణాంతక విషం రిసిన్ ను సిద్దం చేశాడని చెప్పారు.
గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం రిసిన్ ను స్వాధీనం చేసుకుంది డాక్టర్ నివాసంలోంచి. దీనిని పరీక్షల నిమిత్తం లాబొరేటరీకి పంపించనున్నారు. ఈ దాడులకు ప్లాన్ చేసిన వారిలో అబు ఖాదీజా ఒకడని తను ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ) తో సంబంధం కలగి ఉన్నాడని ఏటీఎస్ ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరిని ఉత్తరప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ సయ్యద్ రాజేంద్రనగర్ లోని ఫోర్ట్ వ్యూ కాలనీలోని ఐదు అంతస్తుల అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ లో ఒంటరిగా ఉంటున్నాడని తెలిపారు.
Also Read : Popular Director Sukumar Comments : 2027లో పుష్ప -3పై సుకుమార్ ఫోకస్


















