Aswa Vahana Seva : తిరుపతి ఫ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ పంచమీ తీర్థం సందర్బంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. అంతకు ముందు అమ్మవారు కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై (Aswa Vahana Seva) భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజ రాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో అమ్మ వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
Aswa Vahana Seva Updates
అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉప నిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలు మంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలి దోషాలు తొలగి పోతాయని విశ్వాసం. వాహన సేవలలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, టిటిడి బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, టి.జానకి దేవి, నరేష్ కుమార్, ఎం. శాంతారామ్, జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో కే.వి.మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుండి తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున టీటీడీ ఏర్పాట్లు చేసింది.
Also Read : Raju Weds Rambai Movie Sensational : రాజు వెడ్స్ రాంబాయి చిత్రం ఈటీవీ విన్ స్వంతం



















