Asim Munir : పాకిస్తాన్ : పాకిస్తాన్ దేశ మాజీ ప్రధానమంత్రి, ఒకప్పటి క్రికెట్ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ను చంపేశారా. ఇదే అనుమానాన్ని ఆయన సోదరీమణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జైలు బయట నిరసనకు దిగారు. దీంతో దేశ వ్యాప్తంగా పీటీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చారు. వారంతా ఆ దేశ మిలటరీ చీఫ్ ఆసిఫ్ మునీర్ (Asim Munir) పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు, ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ లోని అడియాలా జైలులో బందీగా ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. జైలు బయట పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. శాంతియుతంగా నిరసనకు దిగిన ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్లపై భౌతికంగా దాడులకు దిగారు. ఈ ఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
Asim Munir Shocking Comments on Imran Khan
ఇమ్రాన్ ఖాన్ ను జైలులోనే చంపేశారంటూ ఆఫ్గనిస్తాన్ టైమ్ ఎక్స్ హ్యాండిల్ లో సంచలన కామెంట్స్ చేసింది. దీని ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా మీడియా అంతటా ఇమ్రాన్ ఖాన్ ను చంపేశారంటూ అనుమానం వ్యక్తం చేస్తూ వార్తలు ప్రసారం చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఖాన్ సోదరీమణులు నోరీన్ నియాజీ, అలీమా ఖాన్, డాక్టర్ ఉజ్మా ఖాన్ జైలు బయట వేచి ఉన్నారు. తాము తమ సోదరుడితో ములాఖాత్ కావాలని కోరినా అందుకు జైలు అధికారులు ఒప్పుకోలేదు. 71 సంవత్సరాల వయస్సులో, నన్ను నా జుట్టు పట్టుకుని, హింసాత్మకంగా నేలపైకి విసిరి, రోడ్డుపైకి ఈడ్చుకెళ్లారు, కనిపించే గాయాలు అయ్యాయి ఖాన్ సోదరి నోరీన్ నియాజీ వాపోయింది. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్‌పై నమోదైన బహుళ కేసుల కారణంగా ఆగస్టు 2023 నుండి జైలులో ఉన్నారు.
Also Read : CM Chandrababu Important Update : భారత రాజ్యాంగం స్పూర్తిదాయకం















