Elephant : మధ్యప్రదేశ్ – ఆసియాలోనే అతి పెద్ద ఏనుగు (Elephant) వత్సల మధ్యప్రదేశ్‌లో (MP) 100 ఏళ్ల వయసులో కన్నుమూసింది. వత్సల అంత్యక్రియలను పన్నా టైగర్ రిజర్వ్ అధికారులు, ఉద్యోగులు నిర్వహించారు. తనను 1971లో కేరళ నుంచి ఇక్కడికి తీసుకు వచ్చారు. అన్ని ఏనుగులకు పెద్దమ్మగా ఉంటూ వచ్చింది. వైద్యుల పర్యవేక్షణలో దానిని కాపాడుకుంటూ వచ్చారు. ఇటీవల గాయపడింది. అనారోగ్యంతో మృతి చెందడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నర్మదాపురం నుంచి పన్నా టైగర్ ప్రాజెక్టుకు అప్పట్లో తీసుకు వచ్చారు. ఆనాటి నుంచి నేటి దాకా రక్షించారు.
Oldest Elephant Death
వత్సల తన ముందు కాళ్ల గోళ్లకు గాయాల కారణంగా రిజర్వ్‌లోని హినౌట ప్రాంతంలోని ఖైరయాన్ కాలువ దగ్గర కూర్చుంది. అటవీ శాఖ సిబ్బంది తనను లేపేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. నిన్న వత్సల ఏనుగు ప్రాణాలు కోల్పోయిందంటూ దానితో ప్రత్యేక అనుబంధం కలిగిన ఉద్యోగులు, సిబ్బంది కంటతడి పెట్టారు. వృద్దాప్యం కారణంగా తన కంటి చూపును కోల్పోయింది. ఎక్కువ దూరం నడవలేక పోవడం కూడా మరో కారణమని పేర్కొన్నారు. పన్నా జిల్లాలోని టైగర్ రిజర్వ్‌లో పశువైద్యులు, వన్యప్రాణి నిపుణులు వత్సల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరీక్షించారు.
సరైన సంరక్షణ కారణంగా వత్సల అభయారణ్యంలోని అరుదైన, అటవీ ప్రాంతంలో చాలా కాలం జీవించిందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా స్పందించిన సీఎం మోహన్ యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వత్సల శతాబ్దపు సహవాసం ఇవాళ ఆగి పోయింది. తన మృతి మాకందరికీ తీరని లోటు అని పేర్కొన్నారు.
Also Read : MLA Prasanthi Reddy Warning : మహిళల జోలికి వస్తే ఊరుకుంటారా – ప్రశాంతి రెడ్డి


















