Ashok Gajapathi Raju : అమరావతి – గోవా గవర్నర్ గా నియమితులైన మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు టీడీపీ పొలిటి బ్యూరో పదవికి రాజీనామా చేశారు. త్వరలో బాధ్యతలు తీసుకోనున్నారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన లేఖను పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాసరావుకు పంపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి సైనికుడిలా పని చేశానని, ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించారని పేర్కొన్నారు. టీడీపీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. గవర్నర్ గా నియమింపబడిన వారు ఏ పదవిలో ఉండకూడదు.
Ashok Gajapathi Raju Resign
శుక్రవారం అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) మీడియాతో మాట్లాడారు. రాజకీయాల పరంగా ఎన్నో నేర్చుకున్నానని, ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించానని చెప్పారు. పార్టీ పరంగా తను కోరుకున్న దానికంటే ఎక్కువే దక్కిందన్నారు. ఈ స్తాయిలో ఉన్నానంటే దానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీనేనని పేర్కొన్నారు. తాను కేంద్ర కేబినెట్ లో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేయడం జీవితంలో మరిచి పోలేనని అన్నారు. తను ఏనాడూ పదవులను ఆశించ లేదన్నారు. కానీ పని చేసుకుంటూ పోయానని చెప్పారు అశోక్ గజపతి రాజు.
ఇదిలా ఉండగా తనకు పార్టీలో వివాద రహితుడిగా పేరుంది. గతంలో వైసీపీ హయాంలో కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగినా ఓర్చుకున్నారు. తిరిగి యథా స్థానానికి వచ్చారు. ఎవరూ ఊహించని రీతిలో ఈసారి తనకు కేబినెట్ లో చోటు దక్కుతుందని భావించారు. కానీ ఊహించని విధంగా గవర్నర్ పదవి దక్కింది.
Also Read : YCP Leader Shyamala Shocking Comments : సినిమా వాళ్లంటే ఎందుకంత చులకన ..?
















