Shakambari Ustavams : హైదరాబాద్ కొత్తపేట శ్రీ రామకృష్ణపురం ప్రాంతంలో వెలసిన కుర్తాల పీఠం ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి దేవాలయంలో సోమవారం ఎంతో వైభవంగా కూరగాయలతో ప్రత్యేక అలంకరణ సేవ నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా వేలాది కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించబడి, భక్తులకు విశేష దైవీయ అనుభూతిని కలిగించింది.
Ashadam Shakambari Ustavams in Kothapet
ఉదయం నుంచే వెళుతురు కిటికిటలతో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. మహిళలు శ్రీలలితా సహస్రనామం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాల్లో పాల్గొన్నారు. భక్తులు ప్రత్యేక హోమాల్లో పాల్గొనగా, ఆలయం పవిత్రతతో నిండి ఉండటాన్ని వీక్షించారు.
సేవల నిర్వహణపై వివరాలు:
ఆలయ కార్యదర్శి శ్రీ మునిపల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ,
“పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానందభారతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో, ఉత్తర పీఠాధిపతులు శ్రీ దత్తేశ్వరానందభారతి మహాస్వామి ఆశీర్వాదాలతో ఆలయంలో అన్ని సేవలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి,” అని తెలిపారు.
అలాగే, శ్రావణ మాసంలో లక్ష గాజుల పూజసేవలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ప్రత్యంగిరా పరమేశ్వరి ఆలయం భారతదేశంలో వారాహి, ప్రత్యంగిరా హోమాలకు ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా నిలిచిందని తెలిపారు. దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారి సేవల ద్వారా అనేక సత్ఫలితాలను పొందుతున్నారని చెప్పారు.
దాన కార్యక్రమం:
అలంకరణలో ఉపయోగించిన కూరగాయలను సోమవారం సాయంత్రం 5 గంటలకు వితరణ చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విఠల్ శర్మ, సువర్ణలత, అరుణ, హేమంత్, విశ్వనాథ్, సాయి, నిఖిల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Also Read : Lal Darwaza Bonalu 2025 Interesting : భాగ్యనగర్ ‘లాల్‌దర్వాజ బోనాలకు’ తరలివస్తున్న భక్తులు

















