Aryna Sabalenka : అమెరికా లోని న్యూయార్క్ లో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన యుఎస్ ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకుంది స్టార్ టెన్నిస్ ప్లేయర్ అర్నా సబలెంకా (Aryna Sabalenka). అత్యంత హోరా హోరీగా ఈ పోరు కొనసాగింది. చివరి దాకా ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో తను విజేతగా నిలిచింది. ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ల మహిళల సింగిల్స్ ఫైనల్‌లో అమెరికాకు చెందిన అమండా అనిసిమోవాను ఓడించింది. అర్నా సబలెంకా స్వస్థలం బెలారస్. వరుసగా తను 2వ యుఎస్ ఓపెన్ టైటిల్ గెలుపొందడం విశేషం. మొత్తంగా వరల్డ్ వైడ్ గా తను 4వ స్థానంలో నిలిచింది. మ్యాచ్ సందర్బంగా ఎలాంటి తప్పులు చేయలేదు సబలెంకా.
Aryna Sabalenka Gets US Open Title
యుఎస్ ఓపెన్ టైటిల్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. అంతే కాదు భారీగా ప్రైజ్ మనీ తో కూడుకుని ఉన్నది. ఈ ఫైనల్ మ్యాచ్ లో అర్నా సబలెంకా అమండా అనిసిమోవాను 6-3, 7-6 (3) తేడాతో మట్టి కరిపించింది. ఇదిలా ఉండగా సరిగ్గా 10 ఏళ్ల క్రితం సెరెనా విలియమ్స్ తర్వాత వరుసగా సంవత్సరాల్లో టోర్నమెంట్‌ను గెలుచుకున్న మొదటి మహిళగా సబలెంకా నిలిచింది. రికార్డు సృష్టించింది. నంబర్ 1 ర్యాంక్‌లో ఉన్న సబలెంకా తన కెరీర్‌లో నాల్గవ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను హార్డ్ కోర్టులలో కైవసం చేసుకోవడం విశేషం. గెలుపొందిన వెంటనే టైటిల్ విజేత గా నిలిచిన సబలెంకా మైదానంలో తీవ్ర భావోద్వేగానికి లోనైంది.
Also Read : Trump Strong Focus : అపెక్ సదస్సుపై అమెరికా చీఫ్ ట్రంప్ ఫోకస్



















