APPSC : అమరావతి – ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తీపి కబురు చెప్పింది. తాజాగా అటవీ శాఖలో కీలకమైన పోస్టులకు సంబంధించి కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జూలై 16 నుంచి psc.ap.gov.inలో అప్లై చేసుకోవాలని కోరింది. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది. ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పాస్ కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
APPSC New Recruitment
ఇందులో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 435 ఉన్నాయని తెలిపింది ఏపీపీఎస్సీ (APPSC). ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ కింద వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 5 వరకు ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆయా జాబ్స్ కు సంబంధించి ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. ఇందులో పూర్తిగా ఆబ్జెక్టివ్ రకం – ఓఎంఆర్ ఆధారితంగా నిర్వహిస్తారు. ప్రధాన పరీక్ష ఆబ్జెక్టివ్ లోనే చేపడతారు. దరఖాస్తు రుసుము కింద రూ. 250 చెల్లించాల్సి ఉంది. పరీక్ష రుసుము రూ. 80 చెల్లించాలని తెలిపింది.
అప్లై చేసే ముందు వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ద్వారా వివరాలు సమర్పించాలి. లాగిన్ చేశాక పోస్ట్ కోసం దరఖాస్తు ఫారమ్ పూరించాలి. జాబ్ కోసం అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి. రుసుము చెల్లించక పోతే అప్లికేషన్ యాక్సెప్ట్ కాదు. దరఖాస్తు చేసుకున్నాక సమర్పించిన ఫారమ్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.
Also Read : Aadhaar Important Update : ఏడేళ్లు దాటితే ఆధార్ అప్ డేట్ తప్పనిసరి

















