విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దళిత క్రిష్టియన్లకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పూర్తిగా అప్రజాస్వామికమని ఆరోపించారు. ఎస్సీలను ఆర్టికల్- 3 లో పరిగణించక పోతే ఎలా ? అని ప్రశ్నించారు. నాస్తికుల పరిస్థితి ఏంటి ? క్రిస్టియన్ మతం లో ఉన్న వాళ్ళను SC లుగా పరిగణించకుంటే ఎలా అని ఆవేదన చెందారు .క్రిస్టియన్ మతంలో ఉన్న నాస్తికులు హక్కు లేకుండా పోతారా ? అని పేర్కొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో దళిత క్రైస్తవుల సంఖ్య దాదాపు 80 లక్షల మంది ఉన్నారని చెప్పారు షర్మిలా రెడ్డి. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా దాదాపు 20 శాతం మందికి పైగా అన్యాయం జరుగుతుందన్నారు.
దీన్ని ఆపలేక పోతే ఎలా అని నిలదీశారు. దళితులకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే బ్రతకలేని పరిస్థితి నెలకొందన్నారు. దళితులకు ఉద్యోగాలు , విద్యా , రాజకీయాల్లో రిజర్వేషన్లు లేకుంటే ఐడెంటీ కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వారి చట్టాలు వారికి భద్రతగా ఉండకపోతే లైఫ్ కి భద్రత ఉండదన్నారు. లేకుంటే దళితులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతారని వాపోయారు. ఈ దేశంలో బ్రతకడం ఎందుకు అనుకుంటారు .. ఈ దేశం ఏమిచ్చినట్లు అనుకుంటారు .రాష్ట్రంలో TDP, YCP లు దళిత క్రిస్టియన్లను మోసం చేసిన పార్టీలు అని ఆరోపించారు. బీజేపీ ఎజెండా ఒక్కటే దేశంలో దళితులు ఉండకూడదు అని. క్రిస్టియన్లు , ముస్లిం లు , దళితులు ఉండొద్దు అని ఆ దిశగా పావులు కదుపుతోందని ఆరోపించారు షర్మిలా రెడ్డి. వారి మీద దాడులు చేసి చంపాలని ఎజెండాగా పెట్టుకుందన్నారు.
