AP Whip Anuradha : అమరావతి – వైసీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ. కొవ్వూరులో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రసన్న కుమార్ రెడ్డి పిచ్చి కుక్కలా వాగుతున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
AP Whip Anuradha Slams YCP Senior Leader
వారి ఇంట్లో వాళ్ళు సైతం సిగ్గుపడేలా ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఇలాగే మాట్లాడుతూ పోతే కూటమి సర్కార్ చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు. మహిళల్ని వ్యక్తిత్వ హననం చేసి మానసికంగా కృంగి పోయేలాగా మాట్లాడుతారా అని ప్రశ్నించారు మంచుపర్తి అనురాధ (AP Whip Anuradha). ఇలా మాట్లాడితే టీడీపీ మహిళలు భయ పడతారని అనుకుంటున్నారా అని నిలదీశారు. వైసీపీ నేతలు ఖబడ్దార్..టీడీపీ మహిళలు తగ్గేదే లేదన్నారు. వైసీపీ మురికి పార్టీ అని, నీచం, ఉచ్చం అన్నీ మరిచి మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు ప్రభుత్వ విప్.
అంబటి, అనిల్ కుమార్ యాదవ్, కారుమూరి నాగేశ్వరరావు, నందిగం సురేష్, గోరంట్ల మాధవ్ , ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి పిచ్చి కుక్కల్ని జగన్ సమాజం మీదకు వదిలారని సీరియస్ అయ్యారు పంచుమర్తి అనురాధ. వైసీపీ నేతలు మహిళల్ని వేశ్యలు, పిశాసులు అంటూ మాట్లాడుతుంటే జగన్ కనీసం ఖండించక పోవడం దారుణమన్నారు. సొంత చెల్లిపై తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్ ది అన్నారు.
Also Read : PM Modi-Trump Big Deal : భారత్-అమెరికా మధ్య మినీ ట్రేడ్ డీల్‌పై ఉత్కంఠ
















