AP Singh : ఢిల్లీ : భారత ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత శక్తి ఏమిటో ప్రపంచం దగ్గరగా చూసిందన్నారు. ప్రత్యేకించి ఇండియా వైమానిక శక్తిని తట్టుకోవడం చాలా కష్టమన్నారు. ఆపరేషన్ సిందూర్‌ను ఖచ్చితమైన ప్రణాళిక, క్రమశిక్షణా శిక్షణ, దృఢ నిశ్చయంతో కూడిన అమలు ద్వారా ఏమి సాధించవచ్చో ఆచచరణలో చూపించామని చెప్పారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ వైమానిక స్థావరంలో 93వ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా వైమానిక యోధులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో శత్రు లక్ష్యాలపై భారత వైమానిక దళం ధైర్యంగా, ఖచ్చితమైన దాడులను చేపట్టిందని అన్నారు. కొన్ని రోజుల్లోనే సైనిక ఫలితాలను రూపొందించడంలో వైమానిక శక్తిని ఎలా సమర్థవంతంగా ఉపయోగించవచ్చో తన దళం ప్రపంచానికి నిరూపించిందని ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ (AP Singh) అన్నారు.
Air Chief Marshal AP Singh Warning
ఇదిలా ఉండగా భారత వైమానిక దళం అధికారికంగా అక్టోబర్ 8, 1932న స్థాపించడం జరిగిందన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రశంసిస్తూ, భవిష్యత్ భద్రతా సవాళ్లకు సిద్దంగా ఉండాలని వైమానిక యోధులకు పిలుపునిచ్చారు ఏపీ సింగ్. ఇవాళ ప్రతి దేశం మన శక్తిని చూసి విస్తు పోయేలా చేశామన్నారు. దీనికంతటికి మీరే కారణమని ఆయన ప్రశంసలు కురిపించారు. ఇదే నిబద్దత, ఇదే శక్తిని రాబోయే కాలంలోనూ ప్రదర్శించేందుకు సిద్దమై ఉండాలని పేర్కొన్నారు. మరోసారి గనుక పాకిస్తాన్ తన తీరును మార్చుకోక పోతే ఈసారి దాడులు దారుణంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు ఏపీ సింగ్. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది మొన్నటికి మొన్న పాకిస్తాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామన్నారు.
Also Read : YV Subbareddy Fired on AP Govt : ఏపీ కూటమి ప్రభుత్వం వేధింపుల పర్వం
















