Montha Cyclone : అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయుగుండంగా మారింది. మొంథా తుపాను (Montha Cyclone) తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ ఎత్తున ఈదురు గాలులు వీస్తున్నాయి. ఎక్కడికక్కడ జనం అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు మంత్రులు నారా లోకేష్, అనిత వంగలపూడి, నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. అవసరమైన నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. తుపాను ప్రభావం రాష్ట్రంలోని 3,778 గ్రామాలపై పడిందని చెప్పారు.
Montha Cyclone Sensational in AP
ఇవాళ మరింత పెరిగింది తుపాను తీవ్రత. అయితే ఎవరూ, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో మంథా తుఫాను తీవ్ర తుఫానుగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. 338 మండలాలలో భారీ వర్షాలు కురియడం ఖాయమని పేర్కొంది. ఈ సందర్బంగా సమీక్ష చేపట్టిన చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. ప్రజలకు రియల్ టై మ్ లో సమాచారం అందించాలని ఆదేశించారు. 26 జిల్లాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు. 22 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం 3,174 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది, వీటిని 3,778 మంది కార్యదర్శులు నిర్వహిస్తారు. ఈ కేంద్రాల్లో ఆహారం , ఇతర వస్తువులు వంటి ముఖ్యమైనవి ఉన్నాయి.
Also Read : Amazon Huge Layoffs : అమెజాన్ లో 30,000 జాబ్స్ కోత
















