అమరావతి : కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. ఈ కీలకమైన గెలుపును దేశ వ్యాప్తంగా సంబురాలు చేసుకుంటున్నారు. విండీస్ పై 5 వికెట్ల తేడాతో విక్టరీ సాధించిన భారత జట్టు ఐసీసీ టి20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు చేరుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో ఈ మ్యాచ్ కొనసాగింది. వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగుల స్కోరును ఛేదించింది టీమిండియా. ప్రత్యర్థి విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో ఇండియా మొదట తడబడినా, వెంట వెంటనే వికెట్లు రాలుతున్నా ఎక్కడా సంయమనం కోల్పోలేదు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ .
తను ఒక్కటే ఒంటరి పోరాటం చేశాడు. భారత జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తను కేవలం 50 బంతులు ఎదుర్కొని 97 పరుగులు చేశాడు. చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 12 ఫోర్లు 4 సిక్సులు ఉన్నాయి. గతంలో పొట్టి వరల్డ్ కప్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా విరాట్ కోహ్లీపై రికార్డ్ ఉండేది. దానిని సంజూ శాంసన్ బ్రేక్ చేశాడు. ఇదిలా ఉండగా టీమిండియా గెలుపొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లిన భారత క్రికెట్ జట్టుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విజయమే లక్ష్యంగా వెస్టిండీస్‌తో జరిగిన కీలక పోరులో, సంజూ శాంసన్ బాధ్యతాయుతమైన ఆటతీరుతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించారంటూ కొనియాడారు.
