CM Chandrababu : సింగపూర్ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపార వనరులున్నాయని , వ్యాపార అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) దిగ్గజ సంస్థల ప్రతినిధులను కోరారు. సింగపూర్ పర్యటన చివరి రోజున పలు కంపెనీలకు చెందిన ప్రముఖులతో వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రభుత్వం రూపొందించుకున్న ప్రణాళికలను ఆయా సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. వివిధ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి…కీలక కంపెనీలుగా ఉన్న కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో చర్చించారు.
CM Chandrababu Key Comments on Investments
రియలెస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీయల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజటల్ టౌన్ షిప్స్ వంటి అంశాలపై కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా) ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరీశంకర్ నాగభూషణంలతో సీఎం చర్చించారు. అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కులు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని వివరించారు. రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టుల ద్వారా అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకున్నామనే అంశాన్ని చర్చించారు. హైదరాబాద్-బెంగళూరు-అమరావతి-చెన్నైల మధ్య ఎయిర్ పోర్టు ఎకనమిక్ కారిడార్ గురించి ఆ సంస్థ ప్రతినిధులకు చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం ఐటీ పార్కుల్లో 30-35 శాతం ఐటీ పార్కుల్లో తాము పెట్టుబడులు పెట్టామని ఆ సంస్థ ప్రతినిధులు చంద్రబాబు (CM Chandrababu) దృష్టికి తెచ్చారు. రియల్ ఎస్టేట్ సహా పారిశ్రామిక రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కెపిటాల్యాండ్ ఇండియా ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు.
మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సంస్థతో జరిగిన సమావేశంలో వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయో డైవర్శిటీ కాంప్లెక్సులు, వైల్డ్ లైఫ్ ఎక్స్ పీరియెన్స్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలపై చంద్రబాబు (CM Chandrababu) చర్చించారు. వైజాగ్, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం రంగంలో భాగస్వామ్యంతో వెళ్తే మంచి చక్కటి అభివృద్ధి సాధించవచ్చని ఆ గ్రూప్ సీఈఓ మైక్ బార్క్‌లేకు సీఎం సూచించారు. సింగపూర్ గార్డెన్ సిటీ, జూ పార్క్ మోడళ్లను ఏపీలో అమలు చేసే అంశంపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. వైజాగ్‌లో డాల్ఫిన్ సిటీ, అమరావతిలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలతో వెళ్తున్నామని.. వాటిల్లో మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరారు. ఈ మేరకు ఆయా రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బార్క్ లే సుముఖత వ్యక్తం చేశారు.
ఇక పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగరాభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై జపాన్‌కు చెందిన సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పోరేషన్-SMBC మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్‌తో ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపారు. లేపాక్షి, ఓర్వకల్లు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న డ్రోన్ సిటీ, డిఫెన్స్, సివిల్ ఎరో స్పేస్ కారిడార్ వంటి ప్రాజెక్టుల గురించి రాజీవ్ కన్నన్‌కు సీఎం వివరించారు. ఓర్వకల్లు, లేపాక్షిల్లోని ప్రాజెక్టులకు అవసరమైన మేరకు ఫైనాన్సింగ్ చేసే అంశంపై కన్నన్‌తో కీలక చర్చ జరిగింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, పారిశ్రామి కారిడార్ల ప్రణాళికలకూ సహకారం అందించాలని సీఎం కోరారు. ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ లెండింగ్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని రాజీవ్ కన్నన్ చెప్పారు.
Also Read : Minister Nimmala Interesting Comments : డిసెంబర్ కల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తాం

















