AP: విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఏపీ (AP) సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తోంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. సీఈఓలు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, కన్సల్టెంట్స్ , పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలోని టైర్ -2 నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుపై కీలకమైన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
AP Gets Huge Investments
ప్రతి ఒక్కరూ ఏపీనే ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలన్న ప్రశ్నకు ఒకే ఒక కారణం ఉందని చెప్పారు. ఇక్కడ ప్రతిభ ఉందని, అంతకు మించి నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించి, సదుపాయాలు కల్పించే అద్భుతమైన డబుల్ ఇంజిన్ సర్కార్ కొలువు తీరి ఉందన్నారు నారా లోకేష్. ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే విశాఖ పెట్టుబడులకు చాలా అనువైనదని చెప్పారు. జీసీసీల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నామని అన్నారు. మూడో కారణం.ఏపీలో ప్రతిభ మాత్రమే కాదు యువతను జీవితాంతం నేర్చుకునేలా చేసే మెకానిజాన్ని ఏర్పాటు చేస్తున్నామన్్నారు.. 42 ఐటీ, ఐటీఈఎస్, జీసీసీ, డేటా సెంటర్స్ సంస్థలతో రూ.44,255 కోట్ల పెట్టుబడులకు ఈ సందర్భంగా జీవోలు, ఎంవోయూలు కుదుర్చుకున్నామని ప్రకటించారు నారా లోకేష్.
Also Read : Minister Kandula Durgesh Important Update : పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా
















