సింహాచలం అప్ప‌న్న స‌న్నిధిలో హోం మంత్రి

కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్న అనిత

hellotelugu-AnithaVangalapudi

విశాఖ‌ప‌ట్నం : విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని ప్ర‌సిద్ద పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా శ‌నివారం దర్శించుకున్నారు రాష్ట్ర‌ హోం మంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో హోం మంత్రికి ఘన స్వాగతం పలికారు పాల‌క మండ‌లి చైర్మ‌న్, స‌భ్యులు, పూజారులు.కప్ప స్తంభం ఆలింగనం స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం చేశారు పండితులు. మంత్రి అనితకు స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లు పరిశీలించారు. క్యూ లైన్లలో నిలిచి ఉన్న‌ చిన్నారులకు పాలు పంపిణీ చేశారు . భక్తులతో మాట్లాడి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

సింహాచ‌లం అప్ప‌న్న స్వామిని ద‌ర్శించుకున్న అనంత‌రం హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత మీడియాతో మాట్లాడారు. దేవుని ద‌య వ‌ల్ల ఎన్డియే కూటమి ఏర్పడిన తరువాత ఆలయాల పరిరక్షణ, ప్రక్షాలనకు నడుం బింగించామ‌ని చెప్పారు. ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టామ‌న్నారు. ఆలయాలకు వచ్చిన భక్తులు ప్రశాంతంగా స్వామిని దర్శించుకొని, తీర్ధ ప్రశాదాలు తీసుకొని ఆనందంగా వెళ్ళేటట్లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామ‌ని చెప్పారు వంగ‌ల‌పూడి అనిత‌. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించాం అన్నారు. లక్షల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నార‌ని తెలిపారు.

Exit mobile version