AP High Court : అమరావతి : ఏపీ హైకోర్టు సంచలన ప్రకటన చేసింది. సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించిన పరకామణి కేసుపై విచారణ చేపట్టింది. ఈ మేరకు ఈ కేసులో సీఐడీ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. టీటీడీ అధికారుల పాత్ర పై క్షుణ్ణంగా విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. అంతే కాకుండా నిందితుడు రవికుమార్ , అతని కుటుంబ సభ్యుల ఆస్తులను పరిశీలించాలని సీఐడీ, ఏసీబీని కోర్టు ఆదేశించింది. లోక్ అదాలత్‌లో గతంలో నమోదైన దొంగతనం కేసు పరిష్కారంపై కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) టీటీడీ పరకామణి వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. దొంగతనంలో పాల్గొన్న రవికుమార్ ఆస్తులను దర్యాప్తు చేయాలని, అతని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలు, ఆస్తులను ధృవీకరించాలని అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)ని కోర్టు ఆదేశించింది.
AP High Court Orders
కేసుకు సంబంధించి ఏవైనా ఆస్తులు బదిలీ అయ్యాయా లేదా అనే విషయాన్ని కూడా దర్యాప్తులో చేర్చాలని స్పష్టం చేసింది హైకోర్టు. అంతేకాకుండా కేసు పరిష్కారంలో టీటీడీ బోర్డు, అధికారుల పాత్రను పూర్తిగా దర్యాప్తు చేయాలని హైకోర్టు నొక్కి చెప్పింది. తదుపరి విచారణలో వివరణాత్మక నివేదికను సమర్పించాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. ఇదిలా ఉండగా పరకామణి కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు టిటిడి ఈఓ అనిల్ సింఘాల్. టిటిడి అనుమతి లేకుండా పరకామణి చోరీ కేసు రవికుమార్,AVSO సతీష్ కుమార్ రాజీ చేసుకున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సందర్బంగా కోర్టు సీరియస్ అయ్యింది. డిసెంబర్ 2వ తేదీ నాటికి కేసు విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. లోక్ అదాలత్ లో కేసు రాజీ చేసిన న్యాయమూర్తిపై కూడా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
Also Read : Supreme Court Shocking Delhi Police : ఢిల్లీ పోలీసుల అభ్యర్థన సుప్రీంకోర్టు తిరస్కరణ



















