AP : విశాఖపట్నం : ఏపీకి ఇన్వెస్ట్మెంట్స్ భారీగా వస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖ వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సును (CII Summit) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ సర్కార్ తో ప్రముఖ దిగ్గజ సంస్థ బ్రూక్ ఫీల్డ్ కంపెనీ రాష్ట్రంలో USD 12 బిలియన్ల వరకు పెట్టుబడుల కోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఇందులో క్లీన్ ఎనర్జీ పవర్డ్ 3 GW డేటా సెంటర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అదనపు క్లీన్-ఎనర్జీ ప్రాజెక్టులు ఉన్నాయి. బ్రూక్‌ఫీల్డ్ మాడ్యూల్ తయారీ , దాని సరఫరా గొలుసు, గ్రీన్ మాలిక్యూల్స్, హాస్పిటాలిటీ, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, వాణిజ్య రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, పోర్టులు, మొబిలిటీ, లాజిస్టిక్స్ హబ్‌లు, పారిశ్రామిక టౌన్‌షిప్‌లలో అవకాశాలను కూడా అన్వేషిస్తుందని చెప్పారు ఈ సందర్బంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
AP Gets Huge Investments
దిగ్గజ సంస్థ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు సీఎం. తమ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. కంపెనీలు ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా నీటి, విద్యుత్ సదుపాయాలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని, దీని వల్లనే కంపెనీలు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
Also Read : CII Summit Interesting Updates : సీఐఐ సదస్సు నిర్వహించడం గర్వంగా ఉంది


















