AP Govt : అమరావతి : ఏపీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లే దర్శనం ఇస్తున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం పెను తుపానుగా మారింది. దీంతో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ, వాతావరణ శాఖ . ఈ మేరకు కీలక ప్రకటన చేశారు ఎండీ ప్రఖర్ జైన్. దీంతో సర్కార్ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు రాష్ట్ర విపత్తుల నిర్వహణ, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. మరో వైపు పిఠాపురంలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు కాకినాడ ఎంపీ తంగిరాల ఉదయ్ (Tangella Uday). ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా పట్టణంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి.
AP Govt Key Comments
తొలుత పిఠాపురం పట్టణం కరివేపాకుపేట లో 26 వార్డు లో పర్యటించి నీట మునిగిన గృహాలను పరిశీలించారు. అనంతరం చిట్టోడి దిబ్బ లో 28, 29 వార్డుల్లో పర్యటించి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. కాలనీల్లో వర్షపు నీరు బయటకు పంపేందుకు తక్షణం ఏర్పాటు చేయాలని, అలాగే పిఠాపురం పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్, ‘పడ’ అధికారులు సమన్వయంతో పనిచేసి పిఠాపురం నియోజవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సూచించారు. పిఠాపురం ఇంచార్జ్ కమిషనర్ పి.రాజు, మునిసిపల్ అధికారులు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : Minister Komatireddy Important Update : రూ. 10,547 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం
















