AP Govt : అమరావతి : ఏపీ సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. పండుగ వేళ ఆనందం కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఈ మేరకు కీలక ప్రకటన చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. ప్రభుత్వం (AP Govt) రాష్ట్ర ఉద్యోగులు,పెన్షనర్లకు 33.67% నుండి 37.31%కి డియర్‌నెస్ అలవెన్స్ ని పెంచింది. ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ పెంపు జనవరి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. ఈ సవరణతో, రెగ్యులర్ ఉద్యోగులకు డీఏ 3.64% పెరుగుతుంది. పండుగ రోజుకు ముందు వివిధ ఉద్యోగుల సంఘాల నాయకులు, మంత్రులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ప్యాకేజీగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
AP Govt Good News
ఇందులో భాగంగా నవంబర్ 1 నుండి ఉద్యోగులకు ఒక విడత డీఏ విడుదల చేస్తామని తెలిపింది సర్కార్. వీటితో పాటు ఇతర ప్రయోజనాలు కూడా అందనున్నాయి. ఉద్యోగి ఆరోగ్య బీమా కార్డులు 60 రోజుల్లోపు పరిష్కరిస్తామని తెలిపింది. అంతే కాకుండా చైల్డ్ కేర్ లీవ్ లను ఎటువంటి వయో పరిమితి లేకుండా 180 రోజుల వరకు పొందవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిబ్బందికి ప్రమోషన్ అనుమతులు కూడా ఓకే చెప్పింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇప్పటికే రూ. 15,921 కోట్ల పెండింగ్ బకాయిలను క్లియర్ చేసింది. అయితే మరో రూ. 23,556 కోట్ల విలువైన మునుపటి కమిట్‌మెంట్‌లను సిస్టమ్‌లోకి అప్‌లోడ్ చేశారు.
Also Read : BC Janardhan Reddy Huge Planing : యాగంటిలో ఏర్పాట్లు ఘనంగా చేపట్టాలి


















