AP Govt : అమరావతి – ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించనున్నట్లు తెలిపింది. ఏపీఎంఎస్‌ఐడీసీకి టెండర్ల బాధ్యత అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పిల్లల ఎదుగుదల కోసం మందులు, ఆహారం కూడా అందించనున్నట్లు పేర్కొంది. గతంలో అమలు చేసిన ఈ పథకాన్ని తిరిగి పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు.
AP Govt Good News
నవజాత శిశువులు, వారి తల్లుల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో గతంలో అమలు చేసిన సంక్షేమ పథకం అమలు చేయాలని ఆదేశించింది సర్కార్. ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సంస్థలలో ప్రసవించే మహిళలకు ఎన్టీఆర్ పేరుమీద ఏర్పాటు చేసిన బేబీ కిట్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం త్వరలోనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రారంభం కానుందని వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా ఆసుపత్రులలో ఏటా వేలాది ప్రసవాలు జరుగుతాయని స్పష్టం చేసింది. కాగా ఎన్టీఆర్ బేబీ కిట్ (NTR Baby Kit) చొరవ పునరుద్ధరణ నవజాత శిశువుల ఆరోగ్య ఫలితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని భావిస్తోంది.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొదటగా జూలై 2016లో ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ సమయంలో 2019లో అనూహ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ రెడ్డి బేబీ కిట్ ని రద్దు చేసింది. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులలో సంస్థాగత ప్రసవాల సంఖ్యను పెంచే లక్ష్యంతో ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకం అసలు వెర్షన్‌ను పునరుద్ధరిస్తోంది.
Also Read : Deputy CM Bhatti Interesting : రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం
















