CM Chandrababu : అమరావతి – రాష్ట్రంలో సహకార రంగం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మహిళలకు ఆర్ధిక భరోసాను కల్పించేందుకు దేశంలో ఎక్కడా లేని రీతిలో తాను ఆనాడు ముందు చూపుతో డ్వాక్రా వ్యవస్థని ఏర్పాటు చేశానని చెప్పారు. ఇవాళ మహిళా సంఘాలుగా ఏర్పడి ఆర్థికంగా మరింత ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆనాడు తీసుకున్న నిర్ణయం ఇవాళ లక్షలాది మంది మహిళల్లో వెలుగులు నింపుతోందన్నారు. నేటికి ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందన్నారు. దేశానికి ఒక ఆదర్శవంత మైనటువంటి వ్యవస్థగా తయారు చేశామన్నారు.
CM Chandrababu Key Comments
దాదాపుగా కోటి మంది మహిళలు ఈ వ్యవస్థలో భాగస్వామ్యులుగా ఉంటూ 42 వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). అయితే ఈ లావాదేవీలు ఎక్కువగా ప్రైవేట్ బ్యాంక్స్ లో జరుగుతున్నాయని, ఆప్కాబ్ బ్యాంకులలో మరింత వేగంగా ట్రాన్ఫర్స్ అయ్యేలా చూడాలన్నారు. ప్రత్యేకించి మారుతున్న టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకు మంత్రులు, ఉన్నతాధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు నారా చంద్రబాబు నాయుడు. ఇందుకు సంబంధించి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రైవేట్ బ్యాంక్ ల కంటే తక్కువగా మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.
Also Read : Minister Atchannaidu Alarming : గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆప్కాబ్ చికిత్స


















