కరీంనగర్ జిల్లా : ఏపీ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ శనివారం ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన కొండగట్టుకు రానున్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మెగా ఫ్యామిలీ కుటుంబానికి ఆంజనే స్వామి వారంటే భక్తి. ఈ ఆంజనేయ స్వామి అంటే ఎనలేని భక్తి పవన్ కళ్యాణ్ కు. ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లేకంటే ముందు కూడా దర్శించుకున్నారు. తనకు ఎనలేని శక్తిని కలిగించేందుకు కారకుడైన ఆంజనేయ దేవాలయానికి ఉడతా భక్తిగా నిధులు మంజూరు చేయాలని స్వయంగా సీఎం నారా చంద్రబాబు నాయుడుకు విన్నవించారు. దీంతో ఏపీ సర్కార్ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా రూ. 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఇందులో భాగంగా రేపు పవన్ కళ్యాణ్ కొణిదల కొండగట్టుకు వస్తున్నారు.
ఉదయం స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం టీటీడీ సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు, మండపానికి పవన్ కళ్యాణ్ శంకు స్థాపన చేస్తారు. 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు ఉంటాయి. స్వామిని దర్శించుకున్న సమయంలో దీక్షా విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం కావాలని అర్చకులు పవన్ కళ్యాణ్ ను కోరారు. ఈ విషయం గురించి సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో చర్చించారు పవన్ కళ్యాణ్ కొణిదల. దీంతో టీటీడీ డిప్యూటీ సీఎం చేసిన ప్రతిపాదనలకు ఓకే చెప్పింది టీటీడీ.



















