AP High Court Shocking : ఏపీ కౌన్సిల్ చైర్మ‌న్ కు హైకోర్టు జ‌రిమానా

అఫిడ‌విట్ దాఖ‌లు ఆల‌స్యంపై ఆగ్ర‌హం

Hello Telugu - AP High Court Shocking

Hello Telugu - AP High Court Shocking

AP High Court : అమ‌రావ‌తి : ఏపీ కౌన్సిల్ చైర్మ‌న్ కు బిగ్ షాక్ త‌గిలింది. రాష్ట్ర హైకోర్టు (AP High Court) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దాఖ‌లు చేయాల్సిన అఫిడ‌విట్ ను ఎందుకు చేయ‌లేదంటూ ప్ర‌శ్నించింది. ఆల‌స్యం కావ‌డం ప‌ట్ల మండిప‌డింది. ఈ సంద‌ర్బంగా రూ. 10,000 జ‌రిమానా విధించింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ విచారించింది. కౌన్సిల్ చైర్మన్ గతంలో సమర్పించిన తన రాజీనామాను ఆమోదిస్తూ ఆదేశించాలని కోరారు. నిర్దేశించిన విధంగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయనందుకు ఏపీ శాసన మండలి చైర్మన్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

AP High Court Slams AP Council Chairman

ఇదిలా ఉండ‌గా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు గతంలో చైర్మన్ ను ఆదేశించింది. చైర్మన్ తరపు న్యాయవాది మరింత సమయం కోర‌డం ప‌ట్ల మండిప‌డింది. కోర్టు ఖర్చును విధించి, బుధవారం నాటికి ఆ మొత్తాన్ని ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్‌లో డిపాజిట్ చేయాలని చైర్మన్‌ను ఆదేశించింది. ఆ మొత్తాన్ని లైబ్రరీ కోసం లా పుస్తకాలు కొనుగోలు చేయడానికి ఉపయోగించాలని కూడా కోర్టు స్ప‌ష్టం చేసింది. సెప్టెంబర్ 19న తదుపరి విచారణకు పోస్ట్ చేయబడింది. ఏపీ కౌన్సిల్ చైర్మ‌న్ బాధ్య‌తా రాహిత్యాన్ని సూచిస్తోంద‌ని పేర్కొంది. ఇలా జ‌రిమానా విధించ‌డం తొలిసారి కావ‌డం విశేషం. ఇది మంచి ప‌ద్ద‌తి కాన‌ది హిత‌వు ప‌లికింది. ఒక బాధ్య‌త క‌లిగిన సంస్థ ఇలా వ్య‌వ‌హ‌రిస్తే ఎలా అని ప్ర‌శ్నించింది.

Also Read : University of California Shocking Trump : ట్రంప్ నిర్ణ‌యంపై ‘కాలిఫోర్నియా యూనివ‌ర్శిటీ’ దావా

Exit mobile version