హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ జర్నలిస్టు ఐ.వెంకట్రావు రాసిన ‘ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ ‘ పుస్తకాన్ని ముఖ్యమంత్ర హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఇదే ఆయన రాసిన ఆంగ్ల పుస్తకాన్ని ‘విలీనం -విభజన’ పేరిట ఎన్.అనురాధ తెలుగులోకి అనువదించారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విలీనం, విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలను పాలించిన 22 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు ప్రత్యేకంగా రచయిత , జర్నలిస్టు ఐ. వెంకట్రావు. ఈసందర్బంగా నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు.
ఆయన అనుభవం ఎందరికో మార్గదర్శకం కాబోతోందన్నారు. ప్రధానంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన రాజకీయ అంశాలు పరిశోధకులకు, భవిష్యత్ తరాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన అనురాధను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి పుస్తకాలు భవిష్యత్తులో మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు సీఎం. ఇన్నేళ్ల కాలంలో ఎన్నో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. రాష్ట్రాలు భౌగోళికంగా విడి పోయినా తెలుగు వారంతా ఒక్కటేనని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. ‘విలీనం విభజన’ పుస్తకం భావి తరాలకు అవసరమని పేర్కొన్నారు.

















